- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ పరిస్థితికి చెక్

దిశ, తెలంగాణ బ్యూరో: పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోనూ జనాభా పెరుగుతున్నది. జనాభాతో పాటే ఆహార సంబంధిత సంస్థలు పెరుగుతున్నాయి. వీటి నియంత్రణ, కల్తీ ఆహారాన్ని ఆరికట్టేందుకు తీసుకునే చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. శాంపిల్స్ సేకరించడం ఒకెత్తయితే ల్యాబ్‌లో టెస్టులు చేయడంతో పాటు ఆ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవడం మరోఎత్తు. ఈ పరిస్థితి నామమాత్రంగానే ఉంది. అందుకు సరిపోను ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు లేకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తంలో నాచారంలో మాత్రమే ల్యాబ్ ఉంది. ఇక్కడ ఫుడ్ టెస్టింగ్ రిపోర్టు రావడానికి 14 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. దీంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. ఆ పరిస్థితికి చెక్ పెట్టెందుకు టెస్టింగ్ ల్యాబ్‌ల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రేటర్‌లో 6.. జిల్లాల్లో 3..
కల్తీ ఆహారం నివారణలో భాగంగా ఫుడ్‌సేఫ్టీ అధికారులు సేకరిస్తున్న శాంపిల్స్‌లను వేగంగా టెస్టులు చేసి వాటికి సంబంధించిన రిపోర్టును సకాలంలో అందించడానికి జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటికి కావాల్సిన 7,500 చదరపు అడుగుల నుంచి 10 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించే బాధ్యత జీహెచ్ఎంసీదేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో ల్యాబ్ నిర్మాణానికి రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. వీటితో పాటు ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్కో మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరో 15 ఫుడ్ ఆన్‌వీల్స్ వ్యాన్లు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కల్తీ ఆహారాన్ని కట్టడిచేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 8 ఫుడ్ ఆన్ వీల్స్ వాహనాలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఒకటి మాత్రమే ఉంది. వీటిని జోన్‌కు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 15 వాహనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో సర్కిల్‌కు ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌ను నియమించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.