- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భూసేకరణకు ఒక్క రూపాయి విడుదల చేయని ప్రభుత్వం : హరీష్ రావు

దిశ,చిన్నకోడూరు : జిల్లాలోని ప్రాజెక్టుల కింద భూసేకరణ కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. మండల పరిధిలోని చౌడారం మీదుగా బిక్కబండకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రాజెక్టుల కింద చిన్న కాలువల కోసం భూసేకరణకు నిధులు విడుదల చేయలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా ప్రజల మీద కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నాడన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నచూపు చూస్తు నిర్వీర్యం చేయాలనే కసితో ఉంది అన్నారు.రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మిడ్ మానేరు లో నీళ్ళు ఉన్నాయంటే కేసీఆర్ పుణ్యం అన్నారు. కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి సిస్టం అంత రెడీ చేశారన్నారు. కేవలం భూ సేకరణ చేసి కాలువలు తవ్వి రైతులకు నీళ్లు ఇవ్వడానికే కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనేత కావడం లేదన్నారు. సంవత్సరం నర కాలంలో ఒక్క ఎకరా కూడా కాలేశ్వరం ప్రాజెక్టు కింద భూసేకరణ చేయలేదన్నారు. ఆగ్రహించిన రైతులు చాలా చోట్ల కూడా సొంత డబ్బులు పెట్టుకొని రైతులే స్వచ్ఛందంగా కాలువలు తవ్వుకొని నీళ్లు తీసుకున్న సందర్భం ఉందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పి రైతులకు మేలు చేయకపోతే రైతుల ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుందన్నారు.
కొండెంగులకుంట, బిక్కబండ రైతులు వస్తే... సొంత డబులతోని మిషన్ లు పెట్టి.. భూ సేకరణలో నష్ట పోతున్న వారికి డబ్బులు ఇచ్చి కాలువలు తవ్వి నీళ్లు అందిస్తానన్నారు. కాళేశ్వరం ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలో 52 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామన్నారు. ఇది కేసీఆర్ చేసిన ఘనత అన్నారు. ఇప్పటికైనా గోబెల్స్ ప్రచారం ఆపి భూ సేకరణ చేసి, కాలువలు తవ్వి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాణిక్య రెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి , మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, కాముని శ్రీనివాస్, జంగిటి శ్రీనివాస్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.