SC classification: సీఎం రేవంత్ రెడ్డి చేతికి ఎస్సీ వర్గీకరణ జీవో కాపీ

by Prasad Jukanti |
SC classification: సీఎం రేవంత్ రెడ్డి చేతికి ఎస్సీ వర్గీకరణ జీవో కాపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ (SC classification) అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో తొలి కాపీనీ మంత్రులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy).. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాంమని ఎస్సీ వర్గీకరణ అమలు చరిత్రాత్మకమైనదన్నారు. నా రాజకీయ జీవితంలో ఎన్నో కీలక ఘట్టాలు చూశాను. ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీల వారు మాట్లాడారు కానీ ఏ పార్టీ కూడా ఆ దిశగా ప్రయత్నం చేయలేదన్నారు. మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సీ వర్గీకరణ దిశగా ప్రయత్నించామని అంబేడ్కర్ జయంతిన సామాజిక స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నామన్నారు. 2026లో జరిగే జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు ఎంత పెరిగితే రిజర్వేషన్లు కూడా అంత పెంచుతామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందనడానికి మరో నిదర్శనం అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. దళితుల్లో సామాజిక ఆర్థిక, వ్యత్యాసాలు ఉండకూడదన్నారు.

Next Story

Most Viewed