ప్రజాపాలనలో రేషన్ కార్డు దరఖాస్తులు ఎన్నో తెలుసా?

by GSrikanth |   ( Updated:2024-01-07 14:40:42.0  )
ప్రజాపాలనలో రేషన్ కార్డు దరఖాస్తులు ఎన్నో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘ప్రజాపాలన’ కార్యక్రమం జనవరి 6వ తేదీ శనివారంతో ముగిసింది. ఈ ప్రోగ్రామ్‌లో ప్రజల నుంచి మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ‘అభయహస్తం’ పేరుతో ఐదు గ్యారంటీలకు 1,05,91,636 అప్లికేషన్లు అందాయి. రేషను కార్డు, ధరణి తదితరాల కోసం అదనంగా మరో 19,92,747 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం 8 పని రోజుల్లో రాష్ట్రలోని మొత్తం 12,769 గ్రామపంచాయతీల్లో, 3,623 మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించి అప్లికేషన్లను తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.

వీటన్నింటి పరిధిలోని మొత్తం 1,11,46,293 కుటుంబాల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. చివరి రోజైన శనివారం మొత్తం 16,90,278 దరఖాస్తులు వస్తే అందులో ఐదు గ్యారంటీలకు సంబంధించినవి 12,53,235 ఉన్నాయని వివరించారు. మరోవైపు ఈ కార్యక్రమానికి చివరి గడువు అంటూ ఏమీ లేదని.. నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎనిమిది రోజుల్లో దరఖాస్తు చేయడం మర్చిపోయిన వారు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి లేదా? మండల పరిషత్ కార్యాలయంలో ఇవ్వాలని సీఎం సూచించారు.

Read More..

ఏపీపై కాంగ్రెస్ ఫోకస్.. 25 మందికి కీలక బాధ్యతలు

Advertisement

Next Story