ప్రజాభవన్ లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై డిప్యూటీ సీఎం సమీక్ష

by Ramesh Goud |
ప్రజాభవన్ లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై డిప్యూటీ సీఎం సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్: మహాత్మ జ్యోతి బాపులే ప్రజాభవన్ (Mahathma Jyothi bapule Praja Bhavan) లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రారంభించబోయే రాజీవ్ యువ వికాసం పథకం (Rajeev Yuva Vikasam Scheme) ప్రారంభంపై సమీక్ష (Review) నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ ప్రీతం (SC Corporationa Chairman Preetham), ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ (ST Corporation Chairman Bellaiah Nayak), మైనార్టీ కార్పోరేషన్ చైర్మన్ ఒబేదుల్ల కొత్వాల్ (Minority Corporation Chairman Obedualla Kothwal) హజరయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై చర్చించారు. నిరుద్యోగుల కోసం తీసుకొస్తున్న ఈ పథకానికి ప్రభుత్వం అప్లికేషన్లు స్వీకరించి, అర్హులను ఎంపిక చేయనుంది.

రేపు రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ ల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యకమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా ఇతర మంత్రులు పాల్గొని పథకం ప్రారంభోత్వవం చేయనున్నారు. కాగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ కోసం సంక్షేమ కార్పొరేషన్లు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 5 వరకు రాష్ట్రంలోని యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు 5 లక్షల మంది యువతకు రూ.6 వేల కోట్లతో ప్రభుత్వ రాయితీ రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించింది.

Next Story

Most Viewed