- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నేను అడ్డుకోలే’.. వీహెచ్ వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి
దిశ, వెబ్‌డెస్క్: టీ-కాంగ్రెస్‌లో ఖమ్మం పార్లమెంట్ హాట్ సీటుగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌లో అధికారంలోకి ఉండటంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోట కావడతంతో ఈ సీటుకు భారీగా పోటీ నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు, మంత్రి తుమ్మల కొడుకు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఈ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే, ఖమ్మం ఎంపీ టికెట్ తనకు రాకుండా భట్టి విక్రమార్క అడ్డుకుంటున్నారని షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంల వీహెచ్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో అధిష్టానానిదే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు. ఏఐసీసీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని స్పష్టం చేశారు. ఖమ్మం టికెట్ వీహెచ్ రాకుండా తాను అడ్డుకుంటున్నాననేది అపోహా మాత్రమేనని.. తాను ఎవరికీ టికెట్ రాకుండా అడ్డుకోలేదని ఈ సందర్భంగా భట్టి క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం టికెట్ సీనియర్ నేత వీహెచ్‌కు ఇస్తే అందరం గెల్పించుకుంటామన్నారు.