- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ పార్టీ భవనాన్ని కూల్చివేయండి: హైకోర్టు ఆదేశం
దిశ, నల్గొండ బ్యూరో: నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ శాఖకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ నాయకులే కార్యాలయానికి కూల్చివేస్తే సరి, లేకపోతే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేస్తారని హెచ్చరించింది. పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఆఫీస్ నిర్మాణం చేయకముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కానీ, నిర్మించిన తర్వాత ఎలా అనుమతి ఇస్తారని న్యాయమూర్తి పిటిషన్ దారులను ప్రశ్నించారు. అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ కార్యాలయం నిర్మాణం చేసిన బీఆర్ఎస్ పార్టీకి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలంటూ మున్సిపల్ కమిషనర్‌ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతకుముందే పలుసార్లు ఆదేశించారు. కాగా ఆయన ఆదేశాలకు వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు కోర్టుకు వెళ్లగా.. ఇప్పుడు అక్కడ కూడా కారు పార్టీకి చుక్కెదురైంది.