Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ కేసు.. కోర్టుకు వర్చువల్‌గా హాజరైన కవిత.. విచారణ వాయిదా

by Ramesh N |
Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ కేసు.. కోర్టుకు వర్చువల్‌గా హాజరైన కవిత.. విచారణ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై ఇవాళ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే కేసులో నిందితులుగా భావిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆప్ నేత మనీష్ సిసోడియా, ఇతర సీబీఐ కేసు నిందితులు కోర్టుకు వర్చువల్‌గా హజరయ్యారు. ప్రతి వాదులు అందించిన ఛార్జ్‌షీట్‌లో క్లారిటీగా లేని పేపర్లను, నేడు అందిస్తున్నామని సీబీఐ కోర్టుకు వెల్లడించింది. ఛార్జ్‌షీట్‌ కాపీలను అనువాదించి ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాది తెలిపారు. ఛార్జ్‌షీట్‌ కాపీలో తెలుగు, ఇంగ్లీష్ పేపర్లు సరిగా లేవని వెల్లడించారు.

ఈ క్రమంలోనే ప్రతివాదులు అడిగిన కాపీలను ఇవ్వాలని సీబీఐని మరోసారి కోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌పై విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. కాగా, లిక్కర్ కేసులో ఢిల్లీల మాజీ డిప్యూటీ సీం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికి జైలులోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నది.

Advertisement

Next Story