DELHI: నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం.. రెండో జాబితాను ప్రకటించే ఛాన్స్

by Shiva |
DELHI: నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం.. రెండో జాబితాను ప్రకటించే ఛాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం జోరు పెంచింది. ఆయా రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను సైతం విడుదల చేసింది. ఈ మేరకు రెండో జాబితాపై కసత్తులో భాగంగా మరోసారి ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాబోతోంది. ఈ భేటీలో తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పంజాబ్ సహా వివిధ రాష్ట్రాల లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా పంజాబ్‌లో అకాలీదళ్‌తో పొత్తులపై చర్చించనున్నారు. ఇవాళ రెండో విడత జాబితాలో 150 స్థానాలకు పైగా అభ్యర్థులను ప్రకటించ అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story