- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్ భేటీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గురువారం సాయంత్రం జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత నేరుగా సచివాలయానికి వచ్చిన సీఎం, మంత్రులు వాళ్ల చాంబర్‌లకు వెళ్లి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఆరు గ్యారంటీల అమలుపై చర్చించారు.
అనంతరం కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన ఖర్చులపై సుదీర్ఘంగా చర్చించి శ్వేత పత్రం విడుల చేయాలని నిర్ణయించారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఎల్లుండి(09-12-2023) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో పాటు స్పీకర్ ఎంపిక ఉంటుందని చెప్పారు. కాగా, ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరు అవుతారా? లేదా? అని తెలియాల్సి ఉంది.