- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికుల డేటా సేకరించాలి.. కలెక్టర్‌కు కార్మికుల వినతి
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ సంస్థలో 23 ఏండ్లుగా మీటర్ రీడింగ్ కార్మికులుగా తాము విధులు నిర్వర్తిస్తున్నామని, అయినా తమకు ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు దక్కలేదని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, థర్డ్ పార్టీ కార్మికుల వివరాలను సేకరించాలని కోరారని, అందులో భాగంగా తమ వివరాలను కూడా సేకరించాలని వారు డిమాండ్ చేశారు.
అందులో భాగంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కు తమను గుర్తించాలని వినతి పత్రం అందజేశారు. కరోనా సమయంలోనూ తాము ప్రాణాలకు తెగించి విధులు చేశామని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు వంద మంది కార్మికులు ఉన్నారని, రాష్ట్రవ్యాప్తంగా 2 వేలకు పైగా కార్మికులున్నారన్నారు. ఇతర ఉద్యోగుల డేటా తీసుకున్నట్లే తమకు సంబంధించిన వివరాలను కూడా సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని వారు కలెక్టర్ కు విన్నవించుకున్నారు.