- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయంత్రం రాజ్‌భవన్‌కు దాసోజు, కుర్ర సత్యనారాయణ
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసైని కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని కోరనున్నారు. కాగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాన్ని కొట్టి వేసే అధికారం గవర్నర్‌కు లేదని హైకోర్టు పేర్కొంది.
కేబినెట్‌కు తిప్పి పంపాలి తప్ప తిరస్కరించకూడదని అభిప్రాయపడింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. మరోసారి ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే కోదండరాం, ఆమీర్ అలీఖాన్‌లను నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను కూడా కొట్టేసింది. హైకోర్టు తీర్పు ప్రకారం.. రేవంత్ సర్కార్ మరోసారి ఎమ్మెల్సీల నియామకం చేపట్టాల్సి ఉంటుంది.