- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పరిస్థితి: Dasoju Sravan
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్‌ఎంసీ ముట్టడికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చింది ప్రజల కోసమా? లేక పబ్లిసిటీ కోసమా? అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఈ మేరకు దాసోజు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకుంటావా? లేక ధర్నాల పేరుమీద అడ్డుకుంటావా? అని అయన ప్రశ్నించారు. ఇంత పెద్ద వరదలు వచ్చినా కూడా ఒక్కరికి హాని కలగకుండా.. ఒక్క ప్రాణానికి నష్టం జరగకుండా జీహెచ్‌ఎంసీ మరియు ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకా మీ ముట్టడి? చిన్న వర్షానికే ప్లాట్స్ సెల్లార్లలోకి నీరు చేరి జనం పడ్డ అవస్థలు ఇప్పుడు లెవనా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్ జనం ప్రాణాపాయంలో పడడడం లేదనా? ఎందుకు మీ అక్కసు? అని అడిగారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందనటానికి ఈ ముట్టడి పిలుపు స్పష్టమైన సంకేతమని అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులను పనిచేయనీయకుండా, వారి విధి నిర్వహణను అడ్డుకోవడం ముమ్మాటికీ నేరమన్నారు. సామజిక బాధ్యత ఉంటే మల్కాజిగిరిలో ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని హితవు పలికారు.