- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CPIM Telangana: వారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయండి
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 21 జిల్లాల్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసిన పేదలపై పెట్టిన కేసులు, ఆర్టీసీ సమ్మె సందర్భంగా కార్మికులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని కోరుతూ సీపీఎం నాయకులు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఇంటింటి సర్వేలో 31 లక్షల మంది పేదలున్నారని ప్రకటించిందని తెలిపారు. పదేళ్లు గడిచినా పేదలకు ఇండ్ల స్థలాలు గానీ, ఇండ్లు నిర్మించి ఇవ్వలేదని చెప్పారు. 2022 నుండి 2024 వరకు 21 జిల్లాల్లో ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకున్న గుడిసెలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూల్చివేసి, కేసులు పెట్టి అరెస్ట్ చేసిందన్నారు.
వరంగల్, హన్మకొండ, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్లలో పేదలపై నాన్ బెయిలబుల్, 307 లాంటి సెక్షన్లతో అక్రమ కేసులు బనాయించారని సీఎం దృష్టికి తెచ్చారు. ఈ సందర్బంగా సీపీఎం ప్రతినిధులు మాట్లాడుతూ.. తాము చెప్పిన అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించి అసెంబ్లీలోనే పెట్టి కేసులు రద్దు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసులు రద్దు చేయాలని సీపీఎం నాయకులు సీఎంను కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు.