- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీపీఐకి తెలంగాణలో ఐదు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలి: చాడ
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సీపీఐ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నదని చెప్పారు. కూటమిలో భాగంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఐదు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. పొత్తు వల్ల సీపీఐ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి బదిలీ అవుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మతాల పేరుతో రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. అయోధ్య రామాలయం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాలని, కూటమి బలోపేతమే దేశ భవిష్యత్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. ఒకరిద్దరు కూటమి నుంచి తప్పుకున్నా సరే, వారిని విడిచి ముందుకు సాగాలన్నారు. ప్రజాస్వామ్యం ఉండాలంటే మోదీ సర్కార్‌ను ఓడించి తీరాలని చాడ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తమకు పట్టుకున్న నియోజకవర్గాల్లో మద్దతు ఇవ్వాలని కోరారు.