- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'భూ సమస్యల పరిష్కారం గాక తీవ్ర ఇబ్బందులు'
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణిలో చోటుచేసుకున్న లొసుగులతో చిన్న సన్న కారు రైతులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు భూముల సమస్య పరిష్కారం గాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ధరణిలో భూ రికార్డులు తారుమారు కావడంతో కొంత మంది రైతులకు రైతుబంధు, చనిపోయిన రైతులకు బీమా అందడం లేదని ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల ఎకరాల్లో సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన భూములు పట్టా సర్టిఫికెట్ కోసం ఇప్పటికీ మీ సేవలో దరఖాస్తులు పెండింగ్లో ఉండడం దుర్మార్గమన్నారు.
ప్రభుత్వం సర్వే నెంబర్ల వారీగా సమగ్ర సర్వే జరిపించి భూ వివరాలను తీసుకొస్తామని నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ భూ తగాదాలు పరిష్కారం కాక ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు, శిఖం భూములు, వక్ఫ్ ల్యాండ్ తదితర భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, ఈ నేపథ్యంలోనే వేములవాడ నాంపల్లి శివారులో పండ్లగుట్టలో క్రషర్స్తో భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని తెలిపారు. 381, 344 సర్వే నెంబర్లలో పేదలకు లావని సర్టిఫికెట్లు ఇచ్చి ఇప్పటికీ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని వివరించారు. ఆ భూములన్నీ కబ్జాకోరు చేతిలోకి వెళ్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి ఉంటుందని పిలుపునిచ్చారు.ః
108 ఉద్యోగులకు వేతనాలు పెంచాలి
108 ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాల నుంచి చాలీ చాలని వేతనాలతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని చాడ వెంకటరెడ్డి అన్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు అక్కడి ఉద్యోగులకు 35 వేల నుంచి 36 వేల రూపాయల వరకు వేతనాలు ఇస్తున్నారని, అదే జీవీకే సంస్థ తెలంగాణలో కూడా 108 నడిపిస్తుందని, ఇక్కడ మాత్రం నామమాత్రంగా 18 వేల రూపాయల వేతనం చెల్లించడం అన్యాయమన్నారు. పక్క రాష్ట్రాల్లో ఇస్తున్న ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్న 108 ఉద్యోగులకు వేతనాలు పెంచి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.