ఆ పనిచేస్తేనే రేషన్ కార్డుల్లో మోడీ ఫొటో పెడతాం.. కాంగ్రెస్ MP కండిషన్

by Gantepaka Srikanth |
ఆ పనిచేస్తేనే రేషన్ కార్డుల్లో మోడీ ఫొటో పెడతాం.. కాంగ్రెస్ MP కండిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో జారీ చేస్తున్న కొత్త రేషన్ కార్డు(New Ration Card)లపై ప్రధాని మోడీ(PM Modi) పెట్టాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) స్పందిచారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. రేషన్ కార్డుల్లో మోడీ ఫొటో పెట్టాలంటే రాష్ట్రంలోని 90 లక్షల కుటుంబాలకు కేంద్రమే బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉంటే.. 54 లక్షల కార్డులకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామన్నారు.


మిగతా 34 లక్షల రేషన్ కార్డులతో పాటు, కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఇస్తున్న 54 లక్షల కార్డులకు ఒక కేజీ చొప్పున అదనపు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. ప్రతి నెల దీనిపై రూ.352 కోట్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. అందుకే కేంద్రం 90లక్షల కార్డులకు బియ్యం ఇస్తే ప్రధాని మోడీ ఫొటో పెడతామని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఇష్టానుసారం మాట్లాడుతున్న బీజేపీ నేతలు గుజరాత్‌కు మోడీ సీఎంగా ఉన్నప్పుడు.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు.. అప్పుడు మన్మోహన్ సింగ్ ఫొటోను మోడీ పెట్టారా? అని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి ఇస్తుంటే.. తిరిగి రాష్ట్రానికి రూ.40 పైసలే ఇస్తోందని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేస్తున్న రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫొటో పెట్టాల్సిందే అని మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రొటోకాల్ ప్రకారం ఫొటో ఉండాల్సిందే అన్నారు. కేంద్రానికి పన్నులు కట్టేది రాష్ట్ర ప్రభుత్వం కాదని.. ప్రజలు కడుతున్నారని గుర్తుచేశారు.

Next Story