MLA Veeresham: దళిత వ్యతిరేకి బీఆర్ఎస్.. మాదిగలంటే గౌరవం లేదు

by Gantepaka Srikanth |
MLA Veeresham: దళిత వ్యతిరేకి బీఆర్ఎస్.. మాదిగలంటే గౌరవం లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళిత వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న తరుణంలో ఉద్యమాన్ని చీల్చి.. ముక్కలు చేసింది బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. దళిత విద్రోహపార్టీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. దళితుల దశాబ్దకల నెరవేరిందన్నారు. సుప్రీంకోర్టును తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిగల పక్షపాతి అని కొనియాడారు. మాదిగల ఉద్యమానికి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు.

సభలో నిలబడిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు కూర్చుంటే మా మాదిగ జాతిని గౌరవించిన వారవుతారన్నారు. మాజాతి ఓట్లు అక్కర్లేదు అంటే, గౌరవం లేదంటే చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీరుపై చర్చజరుగుతుంటే ప్రతిపక్షం సభలో ఉండాలి కానీ అసెంబ్లీలోని సీఎం ఆఫీసు ముందు ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. నాడు సీఎల్పీ లీడర్ భట్టి కి కాన్వాయి ఉంటే ఓర్చుకోలేక నాడు పార్టీమారారని, వీళ్లు దలితపక్షపాతా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దళిత పక్షపాతి అని పేర్కొన్నారు. దళితుల కోసం నిరంతరం పాటుపడే పార్టీ కాంగ్రెస్ అని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed