VH: అలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం కిషన్ రెడ్డి ఇకనైనా బంద్ చేయాలి

by Gantepaka Srikanth |
VH: అలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం కిషన్ రెడ్డి ఇకనైనా బంద్ చేయాలి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy)పై తెలంగాణ కాంగ్రెస్ కీలక, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు(V. Hanumantha Rao) తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తరచూ దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందని అడగటం కాదు.. అసలు ఈ పదేళ్లలో దేశానికి బీజేపీ ఏం చేసిందని వీహెచ్ ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు.. కనీసం పదేళ్లలో అయినా రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? అని అడిగారు. ఇందిరా గాంధీ భూ సంస్కరణలు చేసి, బ్యాంక్‌లను జాతీయం చేసింది. మహాత్మా గాంధీ రోజ్ గార్ యోజన అమలు చేసింది. అంతేకాదు.. కాంగ్రెస్ ఐఐటీ, ఐఐఎమ్‌లో రిజర్వేషన్లు అమలు చేసింది అని వీహెచ్ గుర్తుచేశారు.

‘రాహుల్ గాంధీ ఏ కులం అని అంటున్నారు. రాహుల్ గాంధీది బడుగు, బలహీన వర్గాల కులం. కులగణన చేయాలని సంకల్పించిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ’ అని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కులగణన చేస్తారా? లేదా? బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు ప్రభుత్వం చేసే పనుల మీద విమర్శలు చేయడం తప్ప.. బీసీలపై చిత్తశుద్ధి లేదని అన్నారు. బడుగు, బలహీన వర్గాల గురించి ఆలోచించే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబానికే ఉందని అన్నారు.

రాహుల్ గాంధీ ఆలోచనలను రేవంత్ రెడ్డి ఆచరిస్తున్నాడని తెలిపారు. అన్ని రాష్ట్రాలలో కులగణన చేయాలని బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ముస్లింలు అంటే బీజేపీకి ఎందుకు అంత భయం అని ప్రశ్నించారు. బీజేపీ ఓన్లీ ముస్లిం ఓట్లే కావాలా? అని అడిగారు. ముస్లింలు స్వతంత్ర పోరాటంలో పాల్గొన లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం బంద్ చేయాలని సూచించారు.

Advertisement
Next Story

Most Viewed