ఏడాదికి 2కోట్ల జాజ్స్ అని చెప్పి.. 9 ఏళ్లలో నిరుద్యోగులకు చుక్కలు చూపించారు: నిరంజన్​

by Satheesh |
ఏడాదికి 2కోట్ల జాజ్స్ అని చెప్పి.. 9 ఏళ్లలో నిరుద్యోగులకు చుక్కలు చూపించారు: నిరంజన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ పాలనలో కుంభకోణాలు ఎక్కువ జరిగాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ​పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ హయంలో ప్రజాధనం లూటీ అవుతుందన్నారు. అదానీ వేల కోట్లు దోచుకుంటే.. నీరవ్​మోడీ రూ.14 వేల కోట్లు కుంభకోణం చేశారన్నారు. పీఎం సాయంతోనే ఇద్దరూ దేశ సొమ్మును అక్రమంగా దోచుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్ల పాలనపై మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం చేపట్టనున్నదని, అందులో అన్ని మోసాలను వివరించేందుకు బీజేపీ సిద్ధమైందన్నారు.

బీజేపీ, మోడీ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందనేది ప్రజలందరికీ స్పష్టత వచ్చిందన్నారు. 2014 ముందు దేశాన్ని గుజరాత్ మోడల్‌గా చేస్తామని హామీ ఇచ్చారని, అది ఎక్కడికి పోయిందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని తొమ్మిదేళ్లలో నిరుద్యోగులకు చుక్కలు చూపించారన్నారు. కరోనా సమయంలో హఠాత్తుగా అర్థరాత్రి లాక్ డౌన్ ప్రకటిస్తే ఎంతో మంది కార్మికులు ఇతర ప్రాంతాల నుండి స్వస్థలానికి కాలి నడకతో వందల కిలోమీటర్లు నడిచి ఎంత మనో వేదనకు గురయ్యరన్నారు. నోట్ల రద్దుతో ప్రజలు అవస్థలు పడితే, మోడీ అండతో కార్పొరేట్​సంస్థలు సంబురాలు నిర్వహించుకున్నాయన్నారు. మతాలను రెచ్చకొడుతూ ప్రజలను మోసం చేసే రోజులకు ఇక నుంచి చెక్​పడనున్నదన్నారు.

Advertisement

Next Story

Most Viewed