- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బూతులు తిట్టడంలో KCR పీహెచ్‌డీ చేశారు’
దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయాల్లో హత్యలు ఉండవని, కేవలం ఆత్మహత్యలే ఉంటాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్‌కు కూడా రాజకీయ ఆత్మహత్య జరిగే ప్రమాదం ఉన్నదన్నారు. ఆయన పార్టీలు మారినా.. మెదడు కాంగ్రెస్‌కే మద్దతు చూపుతుందన్నారు. రేవంత్ రెడ్డిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేయడం విచిత్రంగా ఉన్నదన్నారు. రాజకీయాల్లో బూతులు తిట్టే సాంప్రదాయం కేసీఆర్ నుంచే వచ్చిందని, ఇప్పుడు వాళ్లకే తిప్పి కొడుతుందన్నారు.
తిట్లు తిట్టడంలో కేసీఆర్ ఒక యునివర్సిటీ పట్టభద్రుడని, గతంలో ఎన్నోసార్లు ప్రతిపక్షాలను బూతులతో తిట్టిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు. నాయకులను ‘కుక్కలు, నక్కలు, దద్దమ్మలు, కుక్కముతి పిందలు, దరిద్రులు’ ఇలా ఎన్నోసార్లు తిట్లపురాణం పలికాడన్నారు. విద్యుత్ ఇష్యూలో బీఆర్ఎస్ గొయ్యి తవ్వుకున్నదన్నారు. 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని రుజువు కావడంతో టీఆర్ఎస్ నేతలకు మతిభ్రమించిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని, కేసీఆర్ మాటవిని బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్నారు.