- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారు ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారు.. మధుయాష్కీ గౌడ్ షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికారుల తీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కాంగ్రెస్(Congress) నేత మధుయాష్కీ గౌడ్(Madhu Yashki Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పెత్తనం చేసిన అధికారులే ఇప్పుడూ ఉన్నారు.. ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కీలకంగా వ్యవహరించిన వారిని పక్కన పెట్టాలని ప్రభుత్వ పెద్దలకు సూచించారు. ప్రస్తుతం చాలా చోట్ల ఇంటలిజెన్స్ ఫెల్యూర్ చాలా చోట్ల ఉందని అన్నారు. అవినీతి అధికారుల లిస్ట్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది.. ఇక వారిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. పోలీసుల వైఫల్యంతోనే భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య జరిగిందని అన్నారు. సోమేశ్ కుమార్(Somesh Kumar) బాగోతం ఇంకా బయటపడాలి.. సోమేశ్ అండతోనే జీఎస్టీ కుంభకోణం జరిగిందని వెల్లడించారు. రాష్ట్రంలో విచారణ చేయాల్సిన అధికారులే అవినీతికి పాల్పడటంతో విచారణకు సమయం పడుతోందని అన్నారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సైతం ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యూరోక్రాట్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి, సమస్యలను తెలుసుకోవాలని సీఎం రేవంత్ పలుసార్లు కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. కానీ, ఆయన చెప్పినప్పుడు సరేనంటూ తలలూపి.. ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రధానంగా గురుకులాల్లో తలెత్తుతున్న సమస్యలు తెలుసుకునేందుకు రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలని, నెలలో ఒకరోజు రాత్రి అక్కడే బస చేసి, పిల్లలతో చనువు పెంచుకోవాలని సూచించారు. కానీ, ఇప్పటివరకు ఒకరిద్దరు కలెక్టర్లు మాత్రమే గురుకులాలను సందర్శించారు. మెజార్టీ అధికారులు ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే పనితీరు సరిగాలేని కలెక్టర్లు, ఎస్పీలను తప్పించి వారి స్థానాల్లో కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని సీఎంఓ సిద్ధమవుతున్నట్లు సమాచారం.