- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ పని బీజేపీ ఎంపీలు చేస్తే నేనే సన్మానిస్తా.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(BJP MP Raghunandan Rao)పై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘నాకు ఐటీఐఆర్ ఫుల్ ఫాం తెలియదు.. నేను రఘునందన్ అంత చదువుకోలేదు.. ఐటీఐఆర్ ఫుల్ ఫాం తెలియకున్నా.. దాని వల్ల రాష్ట్రానికి కలిగే లాభాలు తెలుసు.. గతంలో సంగారెడ్డిలో ఐఐటీ పెట్టాలనుకుంటున్నానని వైఎస్(Y. S. Rajasekhara Reddy) అన్నారు.. ఆ రోజు నాకు ఐఐటీ అంటే ఏమిటో తెలియదు.. సీఎం అడిగారంటే ఇంపార్టెంట్ అని వెంటనే ఓకే చెప్పాను.. ఐటీఐఆర్(ITIR) మీద కంటే ప్రజల జీవితాలపై నాకు అవగాహన ఎక్కువ’ అని జగ్గారెడ్డి అన్నారు.
రఘునందన్‌కు చదువు అహంకారం నేర్పిందని సీరియస్ అయ్యారు. ఐటీఐఆర్ ఫుల్‌ఫామ్ ముఖ్యమా.. ఐటీఐఆర్ ముఖ్యమా అని ప్రశ్నించారు. రాహుల్ ప్రధాని అయ్యాక ITIRకు కొబ్బరికాయ కొట్టిస్తా అని కీలక ప్రకటన చేశారు. అంతలోపు బీజేపీ ఎంపీలే(BJP MPs) ఐటీఐఆర్ తీసుకొస్తే స్వయంగా నేనే వారికి సన్మానం చేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని కావడం ఖాయం.. మోడీ దుకారం సర్దేయడం కూడా ఖాయమని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.