- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Congress: డ్రగ్స్ వల్ల చిన్నగా కేటీఆర్ దిమాక్.. మెట్టు సాయికుమార్ హాట్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: డ్రగ్స్ వల్లనో, తాగడం వల్లనో కేటీఆర్(KTR) దిమాక్ చిన్నగా అవుతోందని తెలంగాణ ఫిషరీష్ కార్పోరేషన్ చైర్మన్(Telangana Fishery Corporation Chairman) మెట్టు సాయికుమార్(Mettu Saikumar) సంచలన వ్యాఖ్యలు(Sensational Comments) చేశారు. శనివారం గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) వ్యాఖ్యలపై స్పందిస్తూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా.. చేతిలో ఫోన్ ఉంది కదా అని, మైక్ ఉంది కదా అని ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో ఏదిపడితే అది మాట్లాడుతున్నాడని , డ్రగ్స్, తాగడం లాంటి వాటి వల్ల కేటీఆర్ దిమాక్(Brain) చిన్నగా(Smaller) అవుతోందని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) చేసిన కృషికి అవార్డు(Award) వస్తే.. కేసీఆర్(KCR) వల్లే అవార్డు వచ్చిందని కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నాడని, కేటీఆర్ మెదడుకు చిల్లు పడితే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో చెప్పి మా ప్రభుత్వం తరఫున వైద్యం(Treatment) చేయిస్తామని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ జీవితంలో ఒక్కరోజైనా అబద్ధాలు చెప్పకుండా ఉంటాడా? అని, అబద్దాల విషయంలో కేటీఆర్, హరీష్ రావుతో పోటీ పడుతున్నాడని వ్యాఖ్యానించారు. అంతేగాక కేటీఆర్, హరీష్ రావు(Harish Rao) ఇద్దరు తోడు దొంగల్లా తయారయ్యారని, అబద్దాలు అడటంలో హరీష్ రావు సీనియర్ ప్రొఫెసర్ అయితే.. కేటీఆర్ జూనియర్ ప్రోఫెసర్ అని అన్నారు. కేసీఆర్ అబద్దాలు ఆడటంలో రికార్డు సాధించాడని, ఆ రికార్డు బ్రేక్ చేసేందుకు కేటీఆర్ కష్టపడుతున్నాడని విమర్శలు చేశారు. ఇక సీఎం రేవంత్ ప్రత్యేక శ్రద్ధతో మహిళాభివృదికి పథకం తీసుకొస్తే ఆ క్రెడిట్ మీరు తీసుకుంటారా అని మండిపడ్డారు. కేటీఆర్ కి అవగాహన లోపం, సమాచార లోపం రెండూ లేవని, దీనిపై పూర్తి సమాచారం కేటీఆర్ ఇంటి అడ్రస్ కి పంపిస్తామని సాయికుమార్ వెల్లడించారు.