TG Govt: తెలంగాణ మహిళలకు సర్కార్ సూపర్ న్యూస్

by Gantepaka Srikanth |
TG Govt: తెలంగాణ మహిళలకు సర్కార్ సూపర్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళ సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Government) పాలన సాగుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. శనివారం గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం కల్పించామని అన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ప్రోత్సహించాలనే లక్ష్యంతో త్వరలోనే సీఎం రేవత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్ల పంపిణీని ప్రారంభించబోతున్నామని కీలక ప్రకటన చేశారు. సుమారు 40 వేల మందికి వనపర్తిలో త్వరలోనే లబ్ధి పొందనున్నారని అన్నారు. ఉచిత బస్సుతో మహిళలకు కోట్ల ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. గృహజ్యోతి పథకంతో 200 యూనిట్ల కరెంట్ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు.

ఆ నాడు ఇందిరా గాంధీ.. ఈనాడు సోనియా గాంధీ(Sonia Gandhi) కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మహిళలకు అండగా ఉన్నదని అన్నారు. పీసీసీ కార్యవర్గంలోనూ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నామని మరో కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో మహిళలకు సరైన ప్రాధాన్యత కల్పించలేదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ మహిళలు సాధికారత సాధిస్తున్నారని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందితేనే ఆ సమాజం సస్యశ్యామలంగా ఉంటుందని విశ్వసించే కాంగ్రెస్ మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తోందని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే సోనియా గాంధీ పుట్టిన రోజు(Sonia Gandhi's Birthday) సందర్భంగా ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ‘జీరో టికెట్’ ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని చెప్పారు. ఉచిత బస్సుతో మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారని అన్నారు. ఉచిత బస్సుకు సంబంధించి ప్రభుత్వం రూ.300 కోట్లు భరిస్తోందని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందిస్తోంది.. జీరో బిల్లుతో సుమారు 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రేవంత్, మంత్రుల బృందం మొక్కవోని దీక్షతో కులగణన సర్వే నిర్వహించిందని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఎంపీ చామాల కిరణ్, టీజీఐఐసీ నిర్మలా జగ్గా రెడ్డి, బెల్యా నాయక్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొన్నారు.

Next Story