సర్జికల్ స్ట్రైక్స్ చేసే దమ్ము కాంగ్రెస్‌కు లేదు: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-05-11 07:41:20.0  )
సర్జికల్ స్ట్రైక్స్ చేసే దమ్ము కాంగ్రెస్‌కు లేదు: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో లేదో దేవుడికే తెలియాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం వికారాబాద్‌లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ.. సర్జికల్ స్ట్రైక్స్ గురించి సీఎం రేవంత్ రెడ్డి తమాషాగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు కశ్మీర్‌తో పని ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు, కానీ తెలంగాణ ప్రజలు కాశ్మీర్ కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడతారని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

సర్జికల్ స్ట్రైక్స్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కౌంటర్ ఇచ్చారు. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను ఏరి పారేశామని తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ అధీనంలోనే ఉంటుందని, బీజేపీ ఉన్నంత వరకు పీవోకే పాక్ వశం కాకుండా చూస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని తేల్చి చెప్పారు. తె దేశంలో ఉగ్రవాదాన్ని పారద్రోలడానికి ప్రధాని మోడీ చేశారని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉగ్రవాదులను కాపాడుతూ వచ్చిందని ధ్వజమెత్తారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ అంశాన్ని కాంగ్రెస్ 70 ఏళ్లుగా నాన్చూతు వచ్చిందని ఫైర్ అయ్యారు.

మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేవలం ఐదేళ్లలో రామ మందిరం నిర్మించామన్నారు. రామ మందిర ప్రాణప్రతిష్టలో కూడా కాంగ్రెస్ నేతలు పాల్గొనలేదని నిప్పులు చెరిగారు. మజ్లిస్ ఓటు బ్యాంక్ కోసం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, బీజేపీ మాత్రం ఓటు బ్యాంక్ కోసం ఎన్నడూ భయపడలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు తెలంగాణ అభివృద్ధికి కృషి చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మజ్లిస్‌ను రాష్ట్రం నుండి తరిమే శక్తి బీఆర్ఎస్‌కు లేదని.. కేవలం బీజేపీకే కాంగ్రెస్, మజ్లిస్‌ను తరిమే పవర్ ఉందని పేర్కొన్నారు.

Advertisement

Next Story