లంచం అడిగితే ఫిర్యాదు చేయండి : విద్యుత్ సంస్థ

by M.Rajitha |
లంచం అడిగితే ఫిర్యాదు చేయండి : విద్యుత్ సంస్థ
X

దిశ, వెబ్ డెస్క్ : తమ సంస్థలో ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TGSPDCL) ఓ ప్రకటన జారీ చేసింది. ఇకపై తమ సిబ్బంది గాని, అధికారులు గాని ఏ పని కోసం అయినా గాని లంచం అడిగితే తనకు డైరెక్ట్ గా ఫిర్యాదు చేయండి అని టీజీఎస్పీడీసీఎల్ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖి తెలిపారు. కాగా అవినీతి ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లు కేటాయించారు ఫారూఖి. లంచం అడిగినా, సరిగా స్పందించకపోయినా 040-23454884 లేదా 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయమని పేర్కొన్నారు. వర్షాకాలం భారీ వర్షాలకు, గాలులకు విద్యుత్ వైర్లు తెగిపోవడం, విద్యుత్ పోల్స్ పడిపోవడం వంటి ఇతరత్రా సమస్యలను పరిష్కరించాలని అడిగిన ప్రజల వద్ద కొంతమంది సిబ్బంది, అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నట్టు విద్యుత్ పంపిణీ సంస్థ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఆ సంస్థ సీఎండీ.

Advertisement

Next Story

Most Viewed