CC Cameras Incident: మహిళా కమిషన్ ఎదుట హాజరైన CMR కాలేజీ బృందం

by Gantepaka Srikanth |
CC Cameras Incident: మహిళా కమిషన్ ఎదుట హాజరైన CMR కాలేజీ బృందం
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లాలోని CMR ఇంజినీరింగ్‌ కాలేజీ వసతి గృహం(CMR Engineering College Hostel)లోని బాత్‌రూమ్‌లో సీసీ కెమెరాలు(CC Cameras) ఏర్పాటు చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు ఏడుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తాజాగా.. CMR కాలేజీ బృందం రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరైంది. సీపీ కెమెరాల ఘటనపై మహిళా కమిషన్(Telangana Women's Commission) విచారణ జరిపింది. విచారణ అనంతరం కాలేజీ ప్రిన్సిపాల్ మీడియాతో మాట్లాడారు.

‘మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఎదుట విచారణకు హాజరయ్యాం. సీసీ కెమెరాల ఘటనకు సంబంధించిన వివరాలు అడిగారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా వెళ్తాం’ అని అన్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. బిహార్‌కు చెందిన నంద కిశోర్‌, గోవింద్‌ కుమార్‌‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. సీసీ కెమెరాలు గమనించిన విద్యార్థినులు కాలేజీ యాజమాన్యానికి కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని కొన్నిరోజుల పాటు ఆందోళనలు సైతం చేశారు. విద్యార్థినులు ఆందోళన నేపథ్యంలో హాస్టల్ వార్డెన్ ప్రీతి రెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేసింది.

Next Story

Most Viewed