విద్యా కమిషన్‌కు CM రేవంత్ కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |
విద్యా కమిషన్‌కు CM రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు నియోజకవర్గాలవారీగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సమగ్ర విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్​రెడ్డి విద్యా కమిషన్‌కు సూచించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులతో సమీక్ష నిర్వహించారు. అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతోపాటు, విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్‌తో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను ముఖ్యమంత్రి దృష్టికి కమిషన్ తీసుకువచ్చింది. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు, పాఠశాల నిర్వహణ సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై కమిషన్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రికి చైర్మన్, సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, చారగొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డి, తదితరులు అందించారు.

Next Story

Most Viewed