- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష
by Prasad Jukanti |

X
దిశ, డైనమిక్ బ్యూరో : నేషనల్ హైవేలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇవాళ సచివాలయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, జాతీయ రహదారులు నిర్మాణం సాగుతున్న ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధింత ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, పలు అంశాలపై సీఎం అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్స్ సభ్యుడు అనిల్ చౌదరి ఆధ్వర్యంలో అధికారుల బృందం నిన్న సీఎంతో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు తోడ్పాటు అందించాలని సీఎం కోరారు.
Next Story