- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్ఆర్ఆర్‌పై మరో కీలక ముందడుగు.. అధికారులకు CM రేవంత్ డెడ్ లైన్
దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన మరో అడుగు ముందుకు పడింది. ఈ రోడ్డు భూ సేకరణ ప్రక్రియను కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదే టైమ్‌లో పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు క్షేత్ర స్థాయిలోనున్న అడ్డంకులన్నీ అధిగమించి, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్‌లో ఉండగా, ఇపుడు సీఎం రేవంత్ మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యంగా నిర్థేశించారు.
భారత్‌మాల పరియోజన ఫేజ్ వన్‌లో రీజనల్ రింగ్ రోడ్డు (ఉత్తరం) 158.645 కిలోమీటర్ల మేరకు ప్రతిపాదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ప్రాజెక్టు అయిన ఈ రోడ్డుకు అవసరమైన భూసేకరణకు వ్యయాన్ని తెలంగాణ రాష్ట్రం సగం వాటాగా వెచ్చించాల్సి ఉంది. మొత్తం 1935.35 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 1459.28 హెక్టార్ల భూసేకరణ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. గత ప్రభుత్వం సహాయ నిరాకరణ ధోరణి కారణంగా తొమ్మిది నెలలుగా ఈ ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియకు బ్రేక్ పడింది. నేషనల్ హైవే అథారిటీతో తలెత్తిన చిక్కుముడులను పరిష్కరించే ప్రయత్నం జరగకపోవటం వల్లే జాప్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నట్లు సర్కారు పేర్కొంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్‌గా గుర్తించి, పరిశ్రమలను నెలకొల్పేందుకు సరికొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు, ఇందులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి రికార్డు స్థాయి టైమ్‌లో పూర్తి చేయాల్సిన అవసరాన్ని సీఎం అధికారులతో చర్చించారు.
ఈ రహదారి పూర్తయితే రవాణా సదుపాయాలతో సెమీ అర్బన్ జోన్‌లోని కొత్త పరిశ్రమలు రావటంతో పాటు అభివృద్ధి వేగం పుంజుకుంటుందని సీఎం అధికారులకు వివరించారు. నిలిచిపోయిన భూసేకరణను రానున్న 3 నెలలలోనే పూర్తి చేయాలని సీఎం అధికారులకు టార్గెట్‌గా పెట్టారు. భూసేకరణతో పాటే ఆర్ఆర్ఆర్ (ఉత్తరం) పనులకు సంబంధించిన టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ (దక్షిణం) భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆప్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ)ను కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు ఆర్థికంగా ఎంత భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉన్నట్లు సీఎం స్పష్టం చేశారు.
Read More..
Breaking News: భూసేకరణ 3 నెలల్లో పూర్తి కావాలి.. రేవంత్ ఆదేశాలు