CM Revanth Reddy: కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో ఉస్మానియా న్యూ బిల్డింగ్: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |
CM Revanth Reddy: కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో ఉస్మానియా న్యూ బిల్డింగ్: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఈ నెల 31న గోషామహల్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు.కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై (Osmania Hospital New Building) ఇవాళ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధునాతన సౌకర్యాలతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టబోతున్నామని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు ఉండాలన్నారు. కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో పార్కింగ్, మార్చురీ, ఇతర సౌకర్యాలు ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రోడ్లు, బిల్డింగ్ డిజైన్లలో సీఎం పలు మార్పులను సూచించారు. లే అవుట్, బిల్డింగ్ డిజైన్, ల్యాండ్ స్కేపింగ్ విషయంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, రోగులు, వైద్య సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా నిర్మాణాలు ఉండాలని సూచించారు.

Next Story