రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రిని.. చిట్‌చాట్‌లో CM రేవంత్ హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-15 18:31:51.0  )
రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రిని.. చిట్‌చాట్‌లో CM రేవంత్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని.. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈసారి బీఆర్ఎస్(BRS) మీదున్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌(Telangana Congress)కు ఓట్లేసి గెలిపించారు.. రెండోసారి మా మీదున్న ప్రేమతో, మేము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామని మరోసారి స్పష్టం చేశారు.

సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లు అని.. మా పనిమీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. స్టేచర్ కాదు.. స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తా అని మరోసారి స్పష్టం చేశారు. వాళ్లు ఇప్పుడు మౌనంగా ఉన్నా.. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓటేస్తారని అన్నారు. గతంలో ఎన్నికలకు ముందు నేనేం చెప్పానో అదే జరిగింది.. ఫ్యూచర్‌లో కూడా నేను చెప్పబోయేదే జరుగుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

READ MORE ...

కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి.. మండలిలో CM రేవంత్ ఆసక్తకిర వ్యాఖ్యలు

Next Story

Most Viewed