నేడు ‘టార్చ్ రిలే’ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |
నేడు ‘టార్చ్ రిలే’ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని మరింత పెంపొందించాలని ఈ నెల 3న 'టార్చ్ రిలే' ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ(సాట్స్) చైర్మన్ కె.శివసేనా రెడ్డి తెలిపారు. ఈ టార్చ్ రిలే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో క్రీడాజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ లో సీఎం టార్చ్ రిలే తోపాటు 'సీఎం కప్-2024' కు సంబంధించిన 'లోగో మస్కట్' ను ప్రారంభిస్తారని వెల్లడించారు. అనంతరం 2023 గోవాలో జరిగిన జాతీయ క్రీడల్లో పథకాలు సాధించిన క్రీడాకారులకు నగదు పురస్కారాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. టార్చ్ రిలే వికారాబాద్ జిల్లా మీదుగా 16 రోజులపాటు 33 జిల్లాలను కవర్ చేస్తూ తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటుందని వివరించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విజేతలకు ప్రోత్సాహ బహుమతులు అందజేస్తామని తెలిపారు.

Next Story