- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడంగల్ టూర్ క్యాన్సిల్.. ఎల్లుండి రాంచీకి సీఎం రేవంత్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో:సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 5న జార్ఖండ్ కు వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో పర్యటించనున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ లో క్యాంప్ ఏర్పాటు చేశారు. వీరంతా శామీర్ పేట లోని లియోని రిసార్ట్ లో ఉన్నారు. బలపరీక్ష నేపథ్యంలో రేపు సాయంత్రం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి జార్ఖండ్ ఎమ్మెల్యేలు వారి రాష్ట్రానికి ప్రయాణం కాబోతున్నారు. ఆ మరుసటి రోజు సీఎం రేవంత్ రెడ్డి రాంచీకి వెళ్లనున్నారు. దీంతో ఈ టూర్ కు ప్రాధాన్యత ఏర్పడింది. వాస్తవానికి ఫిబ్రవరి 5న తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు పర్యటన షెడ్యూలు కూడా తొలుత ఫిక్స్ అయింది. కానీ జార్ఖండ్ లోని రాజకీయ పరిణామాలతో కొడంగల్ టూర్ క్యాన్సిల్ చేసుకున్న రేవంత్ రెడ్డి జార్ఖండ్ కు వెళ్లనున్నారు.