- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'గురుకుల విద్యార్థిని'కి అండగా.. సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన కొయ్యాడ కార్తీక అనే విద్యార్థినికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. సీఎం సూచన మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ లో కార్తీకకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. కాగా ములుగు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కార్తీక, ఆగస్టు 9 న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి పడిపోయింది. దాంతో విద్యార్థిని నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత వెంటనే గురుకుల సిబ్బంది కార్తీకను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి, అక్కడి నుంచి నిమ్స్ కు తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో న్యూరో సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ బృందం మంగళవారం(ఆగస్టు 13) నాడు కార్తీక కు ఆపరేషన్ నిర్వహించింది. ప్రస్తుతం ఐసీయూలో కార్తీక కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. అయితే కార్తీకకు కావాల్సిన వైద్యం ఖర్చులను ప్రభుత్వమే భరించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. సీఎంవో ఓఎస్డీ శ్రీనివాసులు నిమ్స్ డైరెక్టర్ తో మాట్లాడి కార్తీక కోలుకునేంతవరకు వైద్యం అందించాలని చెప్పారు.