- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లీష్ రాదని సోషల్ మీడియాలో ట్రోల్స్.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ vs బీఆర్ఎస్‌గా ఫైట్ నడుస్తోంది. సోషల్ మీడియాలో రోజూ ఇరు పార్టీల కార్యకర్తలు పోస్టుల యుద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్‌పై, బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో తరచూ సీఎం రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదని ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో భాగంగా చేసిన స్పీచులపై విమర్శలు చేశారు. తాజాగా.. ఈ ట్రోల్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘నాకు ఇంగ్లీష్ కాదని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. నేను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నాను. కాన్వెంట్‌కి వెళ్లి ఉంటే నేను కూడా అద్భుతంగా మాట్లాడే వాడిని. నా గురువులు సరైన విధంగా విద్యాబుద్ధులు నేర్పినందునే నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యాను. అందుకు నా గురువులకు ఎల్లప్పుడూ కృతజ్ఙుడిగా ఉంటాను. నాకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తున్న వారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూసుకోవాలి. చైనా, జపాన్, జర్మనీ ఆయా దేశాల్లో ఎవరికీ ఇంగ్లీష్ రాదని, కానీ ఆ దేశాలు ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్ర స్థానంలో ఉన్నాయనే విషయం గమనించాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.