Revanth Reddy: ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం

by Ramesh N |
Revanth Reddy: ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఉద్యమ కెరటం, ప్రజా యుద్ధ నౌక గద్దర్ (గుమ్మడి విఠల్) జయంతి (GADDAR JAYANTHI) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో (TelanganaCMO) ద్వారా శుక్రవారం ఆయన ఒక సందేశం విడుదల చేశారు. తన కలం, గళంతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారని, సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా ఎలుగెత్తిన గొంతుక అని స్మరించుకున్నారు. గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, వారి పేరుతో అవార్డు (Gaddar Awards) నెలకొల్పి ప్రతి ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుకు చేశారు.

కాగా, భారత 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన (Padma Awards) పద్మ అవార్డులపై తెలంగాణలో వివాదం రేగింది. తెలంగాణ నుంచి ప్రజా గాయకుడు గద్దర్‌, గోరటి వెంకన్న, అందెశ్రీ వంటి ప్రముఖుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ వారిలో ఎవరికి కూడా పద్మా అవార్డులు పొందలేదు. గద్దర్‌కు అవార్డు ఇవ్వడం సాధ్యమే కాదని, గతంలో అనుసరించిన భావజాలంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బండి సంజయ్ గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. తాజాగా గద్దర్ జయంతి ప్రభుత్వం అధికారికంగా చేయడంతో.. రాజకీయ నేతలు బండి వ్యాఖ్యలపై మరోసారి ఏవిధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.

Next Story

Most Viewed