CM Revanth Reddy: రూ.300 కే నెట్, కేబుల్ టీవీ, ఈ -ఎడ్యుకేషన్.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

by Prasad Jukanti |
CM Revanth Reddy: రూ.300 కే నెట్, కేబుల్ టీవీ, ఈ -ఎడ్యుకేషన్.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3 పథకంలో చేర్చాలని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. గ్రామాలు, మండలాలకు నెట్ వర్క్ కలపించడం, 65 వేల ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించడమే టీ ఫైబర్ లక్ష్యం అని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. నెలకు రూ.300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ- ఎడ్యుకేషన్ సేవలు అందించబోతున్నట్లు తెలిపారు. టీ-ఫైబర్ అమలుకు ఎన్ఎఫ్ ఓఎన్ సహకారం అవసరం అని, అందువల్ల భారత్ నెట్ పథకాన్ని టీ-ఫైబర్ కు వర్తింపజేసి టీ ఫైబర్ కు రూ.1,779 కోట్ల వడ్డీ లేని రుణాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed