CM Revanth Reddy: రైల్వే మంత్రితో సీఎం రేవంత్ భేటీ.. సుమారు గంటపాటు చర్చలు!

by Ramesh N |
CM Revanth Reddy: రైల్వే మంత్రితో సీఎం రేవంత్ భేటీ.. సుమారు గంటపాటు చర్చలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా రెండో రోజు (శుక్రవారం) ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ (Nirmala Sitharaman)తో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ఎంపీలు మల్లు రవి, బలరామ్‌నాయక్, చామల కరణ్ కుమార్ రెడ్డి (Chamala Kirankumar Reddy), కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణలు ఉన్నారు.

రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, గ్రాంట్లపై ఆర్థిక మంత్రితో చర్చించారు. నిర్మాలా సీతారామన్‌తో భేటీ అనంతరం సీఎం రేవంత్ బృందం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల మంజూరు, పెండింగ్ ప్రాజెక్టులపై సుమారు గంటపాటు చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రైల్వే మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి శాలువ కప్పి సత్కరించారు.

Advertisement

Next Story

Most Viewed