Nirmal Girl Durga : చిన్నారి దుర్గకు సీఎం రేవంత్ రెడ్డి బాసట.. కలెక్టర్‌కు కీలక అదేశాలు

by Ramesh N |
Nirmal Girl Durga : చిన్నారి దుర్గకు సీఎం రేవంత్ రెడ్డి బాసట.. కలెక్టర్‌కు కీలక అదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారి దుర్గకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బాస‌ట‌గా నిలిచారరు. ఆ బాలికకు అన్ని విధాలా అండ‌గా నిల‌వాల‌ని నిర్మల్ క‌లెక్ట‌ర్‌‌కు సీఎం తాజాగా ఆదేశాలిచ్చారు. ఇటీవల త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌తో ఒంట‌రిగా మిగిలిపోయిన బాలిక దుర్గ‌కు అన్ని విధాలా అండ‌గా నిలుస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించారు. నిర్మ‌ల్ జిల్లా తానూర్ మండ‌లం బేల్‌త‌రోడా గ్రామానికి చెందిన ఒంట‌రి మ‌హిళ మేర గంగామ‌ణి (36) శ‌నివారం రాత్రి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీంతో ఆమె ఏకైక కుమార్తె దుర్గ (11) అనాథ‌గా మిగిలింది. త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌కు డ‌బ్బులేక‌పోవ‌డంతో దుర్గ భిక్షాట‌న చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ విష‌యం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావ‌డంతో ఆయ‌న వెంట‌నే స్పందించారు. బాలిక‌కు విద్యా, వైద్య‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు అండ‌గా నిల‌వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ అభిలాష్ అభిన‌వ్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశం మేర‌కు బాలిక‌కు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠ‌శాల‌లో చేర్చుతామ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. వైద్య‌, ఇత‌ర స‌మ‌స్య‌లేమైనా ఉంటే వాటిని వెంట‌నే ప‌రిష్క‌రిస్తామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.

Advertisement

Next Story