చంద్రబాబు గొప్పతనం గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదు.. CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
చంద్రబాబు గొప్పతనం గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదు.. CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు గొప్పతనం గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన కమ్మ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కమ్మ సామాజిక వర్గం తనను ఆప్యాయంగా చూసుకుంటుందన్నారు. ఎలాంటి నేలలో అయినా పంటలను పండించే శక్తి కమ్మవారిదన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేశారన్నారు. కమ్మ అంటే అమ్మలాంటిదన్నారు. మట్టి నుంచి బంగారాన్ని తీయ గలిగే శక్తి కమ్మవారికి ఉందని కితాబు ఇచ్చారు. పది మందిని ఆదుకునే గుణం కమ్మవారిదన్నారు. ఈ దేశానికి సంకీర్ణ రాజకీయాలను ఎన్టీఆర్ నేర్చించారన్నారు. కమ్మ సంఘం ఐదెకరాల భూమి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కమ్మ సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story