- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రజలకు CM రేవంత్ భారీ గుడ్ న్యూస్.. ఇకపై రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఆ కార్డ్..!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ చెప్పారు. శనివారం వరంగల్ పర్యటనకు వెళ్లిన రేవంత్.. మెడికోవర్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేస్తామని తెలిపారు. ప్రొఫైల్ కార్డులో లబ్ధిదారుల బ్లడ్ గ్రూప్ నుంచి వారికున్న ఆరోగ్య సమస్యలను పొందుపరుస్తామని స్పష్టం చేశారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుల వలన వైద్యం అందించడం సులభం అవుతోందని చెప్పారు. విద్య, వైద్యం అందుబాటులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఫార్మా రంగంపై ఎప్పుడు చర్చ వచ్చినా.. అందులో కచ్చితంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఉంటుందని.. ఇందుకు కారణం దివంగత ప్రధాని ఇందిరా గాంధీ దూరదృష్టేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతోనే తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే వరంగల్‌కు ఎయిర్ పోర్టు రాబోతుందని.. ఓరుగల్లులో హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.