పారాలింపిక్స్ విజేత దీప్తికి సీఎం రేవంత్ రెడ్డి భారీ నజరానా

by karthikeya |
పారాలింపిక్స్ విజేత దీప్తికి సీఎం రేవంత్ రెడ్డి భారీ నజరానా
X

దిశ, వెబ్‌డెస్క్: పారాలింపిక్స్‌ (Paraliympics)లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ (Telangana) యువ అథ్లెట్ దీప్తి జీవాంజీ (Deepti Jeevanjani)ని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అభినందించారు. దీప్తికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు నగదు బహుమానాలను నజరానాగా అందిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఆమె కోచ్‌‌కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా.. ఇటీవల ముగిసిన పారాలింపిక్స్‌లో అథ్లెట్ దీప్తి జీవాంజి 400 మీటర్ల టీ20 రేస్‌ (400m T20 Race)లో కాంస్య పతకం సాధించి సత్తా చాటింది. దీంతో ఆమెను ప్రత్యేకంగా తన కార్యాలయానికి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

ఇదిలా ఉంటే ఈ మధ్య ఓ ఒలింపిక్స్ తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విశ్వవేదికపై సత్తాచాటే అథ్లెట్లు (Athlets), ఆటగాళ్లను తమ ప్రభుత్వం కచ్చితంగా గౌరవిస్తుందని, వారు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రోత్సహిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన మాటను నిలబెట్టుకుని దీప్తిని మరింత ప్రోత్సహించేందుకు గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతితో పాటు వరంగల్‌లో 500 గజాల స్థలం కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పారాలింపిక్స్‌లో పాల్గొనే వారికి మెరుగైన కోచింగ్, ఇతర ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed