- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Revanth Reddy: నాలుగు పథకాలపై నేడు సీఎం హైలెవల్ మీటింగ్!

దిశ, డైనమిక్ బ్యూరో/శంషాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) విదేశీ పర్యటన ముగిసింది. దావోస్ టూర్‌ను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సింగపూర్, దావోస్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగివచ్చిన సీఎంకు పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈనెల 16న హైదరాబాద్ నుంచి బయలుదేరిన రేవంత్ బృందం 17 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటించింది. అనంతరం దావోస్‌కు (Davos) చేరుకుని అక్కడ మరో మూడు రోజుల పాటు డబ్ల్యూఈఎఫ్ సమావేశంలో పాల్గొన్నది. దావోస్ టూర్‌లో భాగంగా ఈ సారి రేవంత్ టీమ్ భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. ఏకంగా రూ.1,78,950 కోట్ల పెట్టుబడులకు సంబంధించి పలు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. కాగా సీఎం తిరిగి రాష్ట్రానికి వచ్చేయగా మంత్రి శ్రీధర్ బాబు మాత్రం ఇంకా దావోస్‌లోనే ఉన్నారు.
సీఎం హై లెవల్ మీటింగ్..
విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నతాధికారులు, అందుబాటులో ఉన్న మంత్రులతో హైలెవల్ మీటింగ్ (high level meeting) ను నిర్వహించబోతున్నారు. ఎల్లుండి నుంచి ప్రారంభించబోతున్న రైతు భరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (Indiramma Atmiya Bharosa), ఇందిరమ్మ ఇండ్లు(Indiramma indlu), రేషన్‌కార్డు (new ration cards) పథకాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారుపై సీఎం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు జిల్లాల్లో పర్యటించి పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులకు స్వయంగా అందజేయనున్నారు. ముఖ్యమంత్రి ఈ పథకాలను స్వయంగా ప్రారంభించేందుకు హైదరాబాద్ సమీపంలోని గ్రామం లేదా తన స్వస్థలమైన మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లే అవకాశం ఉంది. ప్రారంభోత్సవాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనేలా ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.