Revanth Reddy: గందరగోళం ఎందుకు? గ్రామసభల్లో రసాభాసపై రేవంత్‌రెడ్డి ఆరా!

by Prasad Jukanti |
Revanth Reddy: గందరగోళం ఎందుకు? గ్రామసభల్లో రసాభాసపై రేవంత్‌రెడ్డి ఆరా!
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నాలుగు పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఉన్నతస్థాయి సమీక్ష (High Level Meeting) నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేడెట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో (Command Control Centre) నిర్వహించిన ఈ రివ్యూకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాలపై సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధిందిన లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ దరఖాస్తుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పథకాలపై నిర్వహించిన గ్రామ సభల్లో చెలరేగిన గందరగోళానికి గల కారణాలపై సీఎం ఆరా తీసినట్లు తెలుస్తోంది.

మరికాసేపట్లో భట్టి క్లారిటీ

నాలుగు పథకాలను ఒకేరోజు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ స్కీమ్స్ ప్రారంభోత్సవాలపై మరికాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పథకాలను ఎవరు ఎక్కడ ప్రారంభిస్తారనే వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు సమాచారం. రిపబ్లిక్ డే వేడుకల అనంతరం సీఎం ఏదైనా ఓ జిల్లాలో పర్యటించి ఈ స్కీమ్‌లను ప్రారంభించనున్నారని, మిగతా చోట్ల మంత్రులు ప్రారంభించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story