- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారం రోజుల్లో నివేదిక సమర్పించాలి.. విద్యాశాఖ అధికారులకు CM రేవంత్ డెడ్‌లైన్

దిశ, వెబ్‌డెస్క్: విద్యాశాఖ(Education) అధికారులతో సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్థలాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతిపాదిత స్థలాలు స్కూల్స్(Young India Residential Schools) ఏర్పాటుకు అనుకూలమో.. కాదో పరిశీలించాలని అన్నారు. వారం రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో వందశాతం పనులు పూర్తయ్యేలా చర్యలు ఉండాలని సూచించారు. యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు పర్యాటక శాఖ(Telangana Tourism) అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షల్లో సీఎస్ శాంతి కుమారి, పలువరు మంత్రులు, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.
మరోవైపు... హైదరాబాద్ మహా నగరంలో ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. శుక్రవారం టీహబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy), ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో గూగుల్ ప్రతినిధులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. కృత్రిమ మేధ అంకుర పరిశ్రమలకు గూగుల్ తోడ్పాటునందించనుంది. వ్యవసాయం, విద్య, రవాణారంగం, ప్రభుత్వ డిజిటల్ కార్యకలాపాలకు గూగుల్ ఏఐ కేంద్రం సహకరిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.