- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: ఈ నెల 8న యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన..
దిశ, వెబ్‌డెస్క్: అధికారిక కార్యక్రమాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ నెల 8న యాదాద్రి భువనగిరి (Yadadri Bhongir) జిల్లాలో పర్యటించనున్నారు. కాగా, అదేరోజు ఆయన జన్మదినం కావడంతో తొలుత యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడ వైటీడీఏ (YTDA), జిల్లా అధికారులపై సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ధి పనులపై చర్చిస్తారు.
భువనగిరి (Bhongir) నియోజకవర్గ పరిధిలోని వలిగొండ (Valigonda) మండల పరిధిలోని బొల్లేపల్లి, సంగెం, భీమలింగం వంతెన వరకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ (MLA Kumbam Anil Kumar) ఆధ్వర్యంలో చేపట్టే మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్రలో సీఎం పాల్గొంటారు. ఆ తరువాత మిషన్ భగీరథ (Mission Bhagiratha) పథకంలో భాగంగా మల్లన్న సాగర్ (Mallanna Sagar) నుంచి యాదాద్రి జిల్లా (Yadadri District)కు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్‌లైన్ ప్రాజెక్ట్ పైలన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం పైప్‌లైన్ పనులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు. అయితే, సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పర్యవేక్షిస్తున్నారు.