CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఫిక్స్

by Sathputhe Rajesh |
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 3న రాత్రికి హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా బయలుదేరి వెళ్లనుంది. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికాకు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అమెరికాలోని డల్లాస్ తదితర రాష్ట్రాలలో సీఎం పర్యటించనున్నారు. వారం రోజుల పాటు సీఎం అమెరికాలో పర్యటించనున్నారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను సీఎం కలవనున్నారు. తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్‌కు సీఎం తిరిగి రాష్ట్రానికి రానున్నారు.


Next Story