- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణి కార్మికులకు CM రేవంత్ కీలక హామీ
దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇప్పటివరకు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. శుక్రవారం పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణపై ప్రధాని మోడీ సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌ను ఒకలా, తెలంగాణను ఒకలాగా చూస్తున్నారని మండిపడ్డారు. దేశానికి ప్రధాని అయ్యుండి.. అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాల్సింది పోయి.. ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్‌పై అమితమైన ప్రేమను కనబరుస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర పన్నుతోందని దీన్ని తిప్పికొట్టేందుకు అంతా సన్నద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీకి ఓటేస్తే మీ రిజర్వేషన్లు పోయినట్టేనని అన్నారు. అంతా అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రతి పది సంవత్సరాల కొకసారి జనాభా గణన చేసిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.